Bhatti Vikarmarka: 2025-2026 బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన భ‌ట్టి 1 y ago

featured-image

TG : తెలంగాణ అసెంబ్లీలో రూ.3,04,965 కోట్ల‌తో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, సుప‌రిపాల‌న అనే మూడు అంశాలు త‌మ విధాన‌మ‌ని, తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్ర‌ణాళిక‌తో సీఎం రేవంత్ పాల‌న చేస్తున్నార‌ని చెప్పారు. రెవెన్యూ వ్య‌యం రూ. 2 ల‌క్ష‌ల 26 వేల 982 కోట్లు, మూల‌ధ‌న వ్యయం రూ. 36,504 కోట్లు అని తెలిపారు.

బ‌డ్జెట్‌లో రైతు భ‌రోసాకు రూ.18 వేల కోట్లు, వ్య‌వ‌సాయశాఖ‌కు రూ. 24,439 కోట్లు, ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ‌కు రూ. 1,674 కోట్లు, సివిల్ స‌ప్ల‌య్స్‌కి రూ. 5,734 కోట్లు, విద్యాశాఖ‌కు రూ. 23,108 కోట్లు, పంచాయ‌తీరాజ్‌శాఖ‌కు రూ. 31,605 కోట్లు, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌కు రూ. 2,862 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ. 40,323 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం రూ. 17,169 కోట్లు కేటాయించామ‌ని పేర్కొన్నారు.

మైనార్టీ సంక్షేమం కోసం రూ.3,591 కోట్లు, చేనేత రంగానికి రూ.371 కోట్లు, ఐటీకి రూ.774 కోట్లు, పారిశ్రామిక రంగానికి రూ.3,525 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.21,221 కోట్లు, వైద్యారోగ్యానికి రూ.12,393 కోట్లు, పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధికి రూ.17,677 కోట్లు, నీటిపారుద‌ల శాఖ‌కు రూ.23,373 కోట్లు, ఆర్ అండ్ ఆర్‌బీకి రూ.5,907 కోట్లు కేటాయించామ‌ని చెప్పారు.

ప‌ర్యాట‌క రంగానికి రూ.775 కోట్లు, సాంస్కృతిక రంగానికి రూ.465 కోట్లు, అడ‌వులు - ప‌ర్యావ‌ర‌ణానికి రూ.1,023 కోట్లు, దేవ‌దాయ‌, ధ‌ర్మాదాయ శాఖ‌కు రూ.190 కోట్లు, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సంబంధించి రూ.10,188 కోట్లు, ఇందిర‌మ్మ ఇళ్ల‌కు రూ.22,500 కోట్లు, హొంశాఖ‌కు రూ.10,188 కోట్లు, క్రీడాశాఖ‌కు రూ.465 కోట్లు కేటాయించామ‌న్నారు.

ఉచిత విద్యుత్‌కి రూ.3 వేల కోట్లు, ఎంఏ అండ్ యూడీ శాఖ‌కు రూ.17,677 కోట్లు, రాజీవ్ యూవ వికాసం ప‌థ‌కానికి రూ.6 వేల కోట్లు, ఆర్టీసీ మ‌హాల‌క్ష్మీ స్కీమ్‌కు రూ.4,305 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు రూ.2900 కోట్లు, సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో డైట్‌కు రూ.2,659 కోట్లు, స‌న్న‌వ‌డ్ల బోన‌స్ కోసం రూ.1800 కోట్లు, గృహ‌జ్యోతి స్కీమ్ కోసం రూ.2080 కోట్లు, స‌బ్సిడీ గ్యాస్ సిలిండ‌ర్ల‌కు రూ.728 కోట్లు కేటాయించామ‌ని తెలిపారు. క‌ల్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్‌కు రూ.3683 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 11,405 కోట్లు, యూనివ‌ర్సిటీల అభివృద్ధికి రూ.500 కోట్లు, రైతు బీమా స్కీమ్‌కు రూ.1589 కోట్లు, వంద శాతం సోలార్ గ్రామాల‌కు రూ.1500 కోట్లు కేటాయించామ‌ని పేర్కొన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD